Wednesday, 30 November 2011

బెడ్ లైట్


కన్నులు ఊసులాడే వేళ మనసులు బాస చేసుకునే సమయాన శరీరాలు మమేకమయ్యే సమాగ సుమూహూర్తాన…. నీ అమాయకత్వం చూసి…. తిలక్ గుర్తొచ్చి…. ”ఎన్ని పూర్వజన్మల స్మృతుల జాడలు. ఈ క్షణంలొ నీ కనురెప్పల నీలినీడలు” అనిపించింది.
”చీకటి వంటి నీ విచిత్ర వీక్షణాకర్షణకి. సంధ్యాగగనం మీద ఎర్రని ఆందోళనని నేను క్షితిజరేఖలా వంగిన నీ భుజాల ఒంపు దగ్గర ఎగిరి విరిగిన సముద్రపు కెరటాన్ని నేను …” అనాలని కూడా అనిపించింది. ఒట్టు… అందమైన ముగ్ధ మనోహరమైన నీ అమాయకత్వమ్మీద ఒట్టు తల పట్టుక్కూచున్నాడు ప్రణవ్.
”ఏవండీ… తలనొప్పిగా వుందా? అమృతాంజనం పట్టనా?” అంటూ వచ్చి ఆదుర్దాగా అడిగింది అలకనంద.
”కాదు… నా గొంతు గట్టిగా నొక్కిపట్టు” చెప్పాడు ప్రణవ్.
”అలాగేనండీ… గొంతుని గట్టిగా నొక్కిపడితే తల నొప్పి పోతుందా?” అమాయకంగా అడిగిందామె.
”తలనొప్పి కాదు, నా ప్రాణాలే పోతాయి. అప్పుడు నువ్వు ‘పోయిందే… గాయబ్… ఇట్స్ గాన్…’ అనొచ్చు” వళ్ళుమండి అన్నాడు ప్రణవ్.
శుక్రవారం పూట… అపశకునం మాట,లేమిటండీ… దేవుడా… నా మొగుడి అజ్ఞానాన్ని క్షమించు” అంటూ భర్తకు లెంపలు వేసి, తనూ వేసుకుంది.
”ఒసే అలకీ…”కోపంగా అరిచాడు ప్రణవ్.
”అలకీ ఏమిటండీ… ‘పాకీ’లా” బాధగా అంది.
తలని గోడకేసి బాదుకోవాలనుకున్నాడు కానీ ధైర్యం చాలక భార్యవైపు దీనంగా చూసి…. ”అలకా నన్నెందుకే ఇట్టా చంపుకు తింటావు? అయినా నీకీ చాదస్తం ఏమిటే? అసలు నువ్వు నిజంగా బి.కామ్. చదివావా?” అనుమానంగా అడిగేడు ప్రణవ్.
”సరస్వత్తోడండీ… ట్రంక్ పెట్టెలో వున్న సర్టిఫికేట్లు తీసుకొచ్చి చూపించేదా? అని అడిగింది.
”సరస్వతా? ఆవిడెవరు?” అన్నాడు ప్రణవ్.
”చదువుల తల్లండీ…” చెప్పింది అలక.
ఓసారి పైనున్న సీలింగ్ ఫ్యాన్ వంక పిచ్చిగా చూసి…. తన బ్రతుకీ రకంగా తగలడ్డానికి కారణమైన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నాడు ప్రణవ్. ప్రణవ్, అలకనంద దంపతులై ముచ్చటగా మూడు నెలలే అవుతుంది. అత్తకూతురు.. పైగా చిన్నప్పట్నించీ మనసుపడ్డాడు. అలకనంద అందంగా వుంటుంది. ఆపై ఇంకా అమాయకంగా కూడా ఉంటుంది. ఓ యాంగిల్ లొ సంతూర్ మోడల్ లా, మరో యాంగిల్ లొ లక్స్ సుందరిలా వుంటుంది.
బావ ప్రణవ్ అంటే బోల్డు ప్రేమ. బి.కామ్. వరకూ చదివినా అమాయకత్వం పోలేదు. కొండకచో చిన్నచిన్న చాదస్తాలూ పోలేదు. పెళ్ళయ్యాక, కాపురం ప్యారడైజ్ సెంటర్ కు షిఫ్ట్ అయ్యాక తన బ్రతుకు సైనిక పురి ఫ్లై ఓవరయింది. అట్టి కథ క్రమం బెట్టిదనినా…..
”అలకా డియర్…” రెండు స్పూన్ల డాబర్ వారి తేనే గొంతులో పోసుకొని, తియ్యగా పిలిచాడు.
”అలకా అంటే నేను…. మరి డియర్ అంటే ఎవరు బావా?” అడిగింది ముద్దుముద్దుగా అలక.
”కామేడీనా?” అడిగాడు అలక ఒడిలో తలపెట్టి ఆమె నడుం వంపుతో సరాగాలాడుతూ….. తలను కాస్త వంచి, భర్త నుదురు మీద ఓ ముద్దు పెట్టి ”ఆ దేవుడు నీకు కోటేరులాంటి ముక్కుయిచ్చి, ఎర్రటి పెదాలిచ్చి, నాకు అన్యాయం చేశాడు బావా… అమ్మాయిలా నువ్వు భలే ముద్దొస్తున్నావు.”
”నిజ్జమా?” వత్తిపలికి … ఈసారి ఆమె పెదాలను అందుకోబోయాడు ప్రణవ్.
”నీ వెంట్రుకలేంటి బావా… నల్లగా నిగనిగలాడుతున్నాయి. ఏ షాంపూ వాడతావేంటి?”అడిగింది. అతని జుట్టును చెరిపేస్తూ సరిచేస్తూ…చెరిపేస్తూ….
”అది ఇప్పుడు అంత అవసరమా అలకా? ఫస్ట్ నైట్ డైరెక్ట్ గా ఎటాక్ చేస్తే బావోదని, ఇలా ఆరు బయట సరదాగా గడపాలనివస్తే, నేనే షాంపూ వాడతాను… ఏ రేజర్ తొ షేవ్ చేసుకుంటాను? ఇవా అడగాల్సిన ప్రశ్నలు పద…. పద… అసలే టెమ్టింగ్ గా వున్నావు” లడ్డూకు తక్కువ పాలకోవాకు ఎక్కువలా వున్న భార్య అందాలని ఓరగా చూస్తూ అన్నాడు ప్రణవ్.
అగరొత్తులు గారాలు పోతూ, పరిమళాలను ఆ గదినిండా నింపుతూంటే… మల్లెలు మత్తేక్కిస్తూ… ఆ నవ దంపతులను ఆహ్వానించాయి… నీలి బల్బు వయ్యారాలు పోతూ, గుడ్లు మిటకరించి చూస్తుంటే… చల్లగాలి వాళ్ళని చూసి ప్రశ్నించి మురిసిపోయింది. చాలా యాంగ్జయిటింగ్ గా వుంది ప్రణవ్ కు. పెళ్ళయిన మూడు నెలలకు కుదిరిన శోభనం! తను ఏమేం చేయాలో, తను ఏమేంచేస్తే తన అలక ఎలా రియాక్టవుతుందో ఊహించేసుకుంటున్నాడు.
తను చదివిన నవలల్లోని సన్నివేశాలు గుర్తొచ్చాయి. నిక్కర్లు వేస్తుకోవడం మానేసి ప్యాంటు లేసుకున్నప్పట్నుంచీ, తను గురువుగా భావించిన వాత్స్యాయనుడూ గుర్తొచ్చాడు. ప్రణవ్ లొ సెన్సాఫ్ హ్యూమర్ ఎంతుందో… సేక్సాఫ్ హ్యూమరూ అంతేవుంది. ”అలకా… ఎంత బావున్నావు….”అంటూ ఆమె నుదుట సున్నితంగా ముద్దుపెట్టుకున్నాడు.
”నిజంగా అంత బావున్నానా?” అడిగింది అలకనంద లోలోపల తెగ మురిసిపోతూ.
”ప్రామిస్…” అన్నాడు ప్రామిసింగ్ గా ప్రణవ్.
”థాంక్యూ బావా… ఇక మనం పడుకుందామా?” అంది ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకొని.
”మరే… అందుకేగా మనం పెళ్ళిచేసుకుంది” కోపంగా అని, ఆ వెంటనే ఒళ్ళు విరుచుకుంటోన్నభంగిమలో వున్న అలకని చూసి వెంటనే గుటకలు మింగాడు. అలక ఒళ్ళు విరుచుకున్నప్పుడు భుజం మీదుగా వున్న పసుపు చీర సిగ్గేసి కిందకి జారిపోయింది. జాకెట్ లోంచి ఆమె అందాలు ఊరిస్తున్నాయి. మరోసారి గుటకలు మింగి… ”అదికాదు అలకా…. ఇవ్వాళ మనకు ఫస్ట్ నైట్ కదా…” గుసగుసగా అని ఫస్ట్ నైట్ ప్రాశస్త్యాన్ని పది నిమిషాలపాటు వివరించాడు ప్రణవ్
. వెంటనే తెగ సిగ్గుపడిపోయి…”సారీబావా… సరే కానీయ్…” అంటూ కళ్ళు మూసుకుంది.
బిక్కచచ్చి, సిగ్గు కాబోలు అనుకొని…. ఆమె మీదికి వంగి, తన చేతిని ఆమె నడుమ్మీద వేశాడు. ‘కెవ్వున’ కేకవేసింది అలక. ఉలిక్కిపడి వీపు చరుచుకుని…
”ఏమైంది అలకా… అంత చేటున అరిచావ్… బూచిగానీ కలలోకి వచ్చిందా?” అడిగాడు గాబరాగా.
”ఊహూ…. నాకు సిగ్గు….”
”సిగ్గుపడితే …. మన ఫస్ట్ నైట్ చేసుకున్నట్టే….” అని మళ్ళీ అలకని దగ్గరకి తీసుకోబోయాడు.
”మళ్ళీ అరుస్తా… నాకు వెలుతురులో…. ఛీ… ఛీ….యాక్…” అంటూ వాంమ్టింగ్ సెన్సేషన్ ఎక్స్ ప్రెస్ చేసింది.
”అంటే ఫస్ట్ నైటే వద్దా…” ఒళ్ళుమండి అడిగాడు.
”అదికాదు బావా…. లైటు వుంటే నాకు చెప్పలేనంత సిగ్గు… బెడ్ లైట్ ఐనాసరే… అందుకని లైటాఫ్ చేసి…” అని కళ్ళుమూసుకొని ”నీ యిష్టం” అంది అలకనంద. అదిగో …. అక్కడే వచ్చింది చిక్కు. లైటాఫ్ చేసి, ఓ అర్థరాత్రి భార్యను ఇటుతిప్పి, తన పనికానిచ్చేసుకొని, ఆపై అటు తిరిగే… సృష్టికార్యమంటే ఒళ్ళుమంట అతగాడికి! మనసూ, మనసూ ఒకటై, తనువూ తనువూ మమేకమై… శృంగారంలోని మాధుర్యాన్ని పండువెన్నెల్లో అనుభవించాలనే థియరీ అతనిది.
ఎట్ లీస్ట్… బెడ్ లైట్ కూడా వుండొద్దంటుంది అలక. ఆ మాత్రందానికి చీకట్లో శృంగారం ఎందుకంటాడు ప్రణవ్. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించాక సడెన్ గా ఓ మెరుపు మెరిసింది ప్రణవ్ మెదడులో. మూడురోజులూ నిస్సారంగానే గడిచిపోయాయి. మూడు రాత్రులూ ముచ్చట్లు మొహం చాటేశాయి. నాలుగో రోజు అమోఘమైనటువంటి ఐడియాతో అలకనంద పక్కకు హుషారుగా చేరాడు ప్రణవ్.
”అలకా… నీకు బెడ్ లైట్ కూడా ఉండకూడదు ఆ టైంలొ… అంతేకదా….”అడిగాడు ప్రణవ్.
”అవును బావా… ఈ ఒక్కవిషయంలో ఆయామ్ సారీ…”అన్నది అలకనంద.
”సరే… అయితే ఓ కండీషన్… మరో ట్విస్ట్….” అన్నాడు ప్రణవ్.
”ఏంటి?” అడిగిందామె.
”నీ కళ్ళకు మల్లెల గంతలు కడతా…”
”మల్లెల గంతలా?”
”అవును… మల్లెపూల మాలలతో నీ కళ్ళకు గంతలు కట్టేస్తా… రొమాంటిక్ గేమ్… ఫస్ట్ నైట్ అయిపోయేసరికి మల్లెలు మంచంపైకి రావాలి… దారం మిగులుతుంది.”
గమ్మత్తుగా అనిపించి ‘సరే’ అంది అలకనంద.
”అలాగే మరొకటి… నీ చేతులకు నేనే స్వయంగా గోరింటాకు పెడతా…. పొరపాటున కూడా గోరింటాకు చెదిరిపోవద్దు… ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమ నా మీద నీకు వున్నట్టు… సరేనా?” అన్నాడు. ఆమెకి గోరింటాకు పెడతాననడంలొ ప్రణవ్ మనసులోని ఆలోచన వేరు. అలాకకు గోరింటాకు అంటే చాలా ఇష్టం… ఎట్ ఎనీ సిట్యుయేషన్…. తనను చేతుల్తో దూరంగా తోసేయకుండా ముందు జాగ్రత్త అది. బెడ్ రూమ్ లొ రొమాంటిక్ గేమ్ మొదలైంది.
మల్లెపూలమాలను తలమీదుగా కళ్ళకు గంతలుకట్టాడు. ఆమె కళ్ళని మల్లెలమాలలు పూర్తిగా కవర్ చేశాయి. చేతికి గోరింటాకు పెట్టాడు. వింతైన శోభనానికి రాత్రి ఆయత్తమవుతుంది. విభిన్నమైన రోమాంచితపందేనికి అగరొత్తులు పరవశించనున్నాయి. ఆ రాత్రి ముద్దుగా, ముగ్ధలా వుంది. ఆ గది ఆ దంపతుల శృంగార యుద్ధాన్ని వీక్షించడానికి సమాయత్తమయింది. మంచంపై వెల్లకిలా పడుకుంది అలకనంద. చేతులు వెనక్కి తలమీదుగా పెట్టుకుంది. ఆ భంగిమ విరహవేదనతో ఎదురుచూసే విరహూత్కంఠిత గుర్తొచ్చింది.
ఆముక్తమాల్యదలోని గోదాదేవి పడిన విరహవేదన గుర్తొచ్చింది. ఆ నవలా యలంతి పసుపొడి…. దుకూలము దాల్చిక్ గుబ్బచన్ గానలదాపు, లుప్పతిలవి గుంకుమతేటలనిగ్గ దేరగాప్రాసన్ నాభి దీర్చి, పితృబద్ధలతాంతములద్దిగొప్పునన్ బూనియొకింతలోపునిచి పుచ్చి చెలింగని కెచ్చ నూర్చుచున్”బావా బెడ్ లైట్…” అంది అలక.
”ఆర్పేశాను….”ఠక్కున సత్యహరిశ్చంద్రుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పేడు. స్వర్గలోకానవున్న హరిశ్చంద్రుడు గతుక్కుమనే వుంటాడు ఈ (అ)సత్యం మింగుడుపడక. ”థాంక్యూ బావా…” అంది అలకనంద బెడ్ లైట్ లేకుండానే తన కోరిక తీరుతున్నందుకు పొంగిపోతూ…. ”ఇట్సాల్ రైట్…” అని ఓసారి నాలిక బయటకని, తిరిగి లోపలికి తీసేసి ఆబగా, ఆత్రంగా ఆమె పైకి ఒదిగిపోయాడు. పి.టి.ఉష కన్నా వేగంగా, అశ్వనీ నాచప్ప కన్నా స్పీడుగా తన ప్రాణసఖి మీదవున్న వస్త్రాలను బహిష్కరించేడు. ఇద్దరిమధ్య మౌనం. మనసులు ఊసులాడుకుంటున్నాయి…. శరీరాలు పెనవేసుకుంటున్నాయి….
చలిలో కూడా చెమటలు స్వేచ్ఛగా శరీరాన్ని ఆక్రమించుకుకుంటున్నాయి…. ఇద్దరిమధ్యా స్వీట్ రివెంజ్… ఇద్దరి మధ్యా స్వీట్ రొమాంటిక్ వార్…. చుంబనక్షణాన దంతక్షతాలు, నఖక్షతాలు… ఇవే వాళ్ళ ఆయుధాలు… రెండు శరీరాలు డీకొన్నాయి. రెండు మనసులూ సేదతీరాయి…. కళ్ళకు అచ్చాదనగా వున్న మల్లెలు మనస్ఫూర్తిగా మంచంపై రాలిపడ్డాయి. ఎక్కడో కోడికూసింది…. కళ్ళు తెరిచింది అలకనంద…. తృప్తిగా తన అనాచ్చాదిత గుండెలమీద సేదతీరుతున్న తన బెటరాఫ్ ని చూసి మురిసిపోయి, తలతిప్పి చూసి ఉలిక్కిపడింది. బెడ్ లైట్ నవ్వుతూ విష్ చేస్తున్నట్టు వె…లు….గు…. తూ వుంది. అంటే రాత్రి వెలుతురులోనే…. రొమాంటిక్ గేమ్ అని తనతో చెప్పి…. నమ్మించి… అయినా భర్తమీద కోపం రావడం లేదు. పూర్తిగా తృప్తి చెందింది కాబట్టి.
తను ఆ కలయికని ఎంజాయ్ చేసింది. అంటే కేవలం తన మనసులో సైకలాజికల్ ఫీలింగ్. అయినా తమ మధ్య సిగ్గుతెరలెందుకు? ఆమె లాజిక్ వెతికి, రాత్రి అందంగా తనని మోసగించిన భర్త వైపు ప్రేమగా… అతనికి సహకరించిన బెడ్ లైట్ వైపు గుర్రుగా చూసి, గోరింటాకు చేత్తోనే భర్త వీపుమీద నఖక్షతాలు సృష్టించింది. తర్వాత చూసుకుంటే తను చెయ్యేకాదు భర్త వీపు కూడా ఎర్రగా పండింది. నిజంగా ఎంత ప్రేమో!

No comments:

Post a Comment