http://www.teluguvanitha.com/మానసిక విరోధాలు భయాల వల్ల చాలామంది తమకి నపుంసకత్వం ఉందేమోనని భావిస్తూ ఉంటారు. వారిలో అంగస్తంభనం ఉంటూనే ఉంటుంది. కాని సంయోగం జరపగలమనే ఆత్మవిశ్వాసం వారిలో లోపించి ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేకపోయేసరికల్లా భవిష్యత్ దాంపత్య జీవితం గురించి అంతులేని ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఈ ఆందోళనతో వివాహానికి ముందే తమ కామసామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని భావిస్తారు. కాని ఒక ప్రక్క తాము తప్పుపని చేస్తున్నామనే భావం, ఎవరైనా చూస్తారేమోనన్న భయం, సుఖవ్యాధులు వస్తాయేమోనన్న అనుమానం, అంతకంటే ఈ పరీక్షలో తాము నెగ్గుతామా, నెగ్గమా అనే అమితమైన మానసిక ఆందోళన ఉంటాయి, ఇటువంటి భయాలు, అనుమానాలు, ఆందోళనలతో దొంగచాటుగా పరస్త్రీలతోనో, వేశ్యలతోనో సంయోగం చేయబోగా అపజయమే ఎదురవుతుంది.
ఎప్పుడైనా సఫలీకృతమైన సంయోగానికి ఎటువంటి భయాలు, అనుమానాలు, ఆందోళనలు లేకుండా ఉండాలి. కామ సామర్థ్యానికి పరీక్ష అంటూ పరస్త్రీలతోను, వేశ్యలతోను పనికిరాదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషుని పుంసత్వాన్ని నిర్ణయించేందుకు గీటురాయి కానేరదు. ఎప్పుడైనా సరే మనిషికి పరీక్ష అంటే భయం, టెన్షన్ తయారవుతాయి. ముఖ్యంగా ఈ టెన్షన్, భయం సంయోగం సఫలీకృతం కావడానికి పనికిరావు. అటువంటప్పుడు పరీక్ష అంటూ సంయోగం జరిపి అసఫలుడై ఎల్లప్పటికీ మానసిక వేదననీ, నపుంసకత్వాన్ని తెచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాక సానుభూతితో విషయాన్ని పరిశీలించి అసలు కారణం బయటకు తీసి దానికి సంబంధించిన భయాల్ని, అనుమానాల్ని తొలగించినట్లయితే నపుంసకత్వం దానంతటకదే పోతుంది.
హస్త ప్రయోగం స్వప్నస్కలనం, మూత్రంలో వీర్యం అంగ పరిమాణం మొదలైన వాటి గురించి అనవసరంగా భయాలు కలిగించుకుని కొందరు నపుంసకులుగా మారితే, మరికొందరు కామవాంఛలు అంతగా కలగటం లేదని బాధపడి నపుంస కులుగా తయారవుతారు. కామవాంఛ తక్కువగా ఉండటానికి శారీరక అనారోగ్యం, నీరసం, హార్మోన్లు తక్కువగా ఉండడం, భార్య ఎడల అయిష్టత కారణాలు కావచ్చు. కుటుంబ బాధ్యతలు, నిరుద్యోగం, యంత్రంలాగా గడిచే జీవితం, ఇలాంటి వ్యక్తుల్లో కామం అసలు లేనట్లే ఉండికూడా వాళ్ళ అభిరుచికి తగిన స్త్రీ వారికి పరిచయమయినా, వివాహం చేసుకున్నా కామం ప్రకోపిస్తుంది. అదీకాక మనుష్యు లందరిలోనూ కామవాంఛ ఒకలాగా ఉండదు. మనిషి-మనిషికి తేడా వుంటుంది. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు వున్న పరిస్థితులు, వారి సంపర్క భావాల బట్టి వాంఛలలో హెచ్చుతగ్గులు వుంటాయి.అలాగే వయస్సుబట్టి కామవాంఛలు కలగడం కలగకపోవడమంటూ వుంటాయి.
స్వరూప్ కి స్వంత ఆలోచనలు కలుగుతూ వుంటాయి. ఆ ఆలోచలనకి అర్థం పర్థం ఉండదనే చెప్పాలి. అంతకంటే ఏమిటంటే ఈ మధ్య అతను ఓ సినిమా చూడటం తటస్థించింది. అది చూసిన దగ్గర నుండి అంతులేని ఆందోళన కలగ నారంభించింది. సినిమాలో ఆ సంఘటన ఎంత అసహజమో, స్వరూప్ లో తెచ్చిపెట్టుకున్న మానసిక వ్యధ అంతగానే అర్థం లేనిది. అయినా అతనికి నచ్చ చెప్పాలంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటారేమో అది అతని జీవిత సమస్యగా భావించడమే. తనకి నపుంసకత్వం వచ్చేసిందని భావించాడు. దానికి కారణం ఈ మధ్య తాను వెళుతున్న రిక్షా బోల్తాపడటం, అలా పాడినప్పుడు తన నడుం మీద నుంచి రిక్షా దొర్లుకుపోవడం జరిగింది. మరి అలా జరిగినప్పుడు నడుము రెండు రోజులపాటు నొప్పి పుట్టక ఏం చేస్తుంది?
ఇంత ఇలా జరిగినా తాను అంతగా దిగులు చెందలేదు కాని ఇది జరిగిన కొద్ది రోజులకే తాను చూసిన సినిమాలో హీరో మేడమీద ఉంచి క్రిందకి ప్రమాదవశాత్తు పడిపోవడం, నడుముకి దెబ్బ తగలగడం కోలుకోవడం జరుగుతుంది. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే ఆ హీరో భవిష్యత్ జీవితంలో దాంపత్య జీవితానికి పనికిరాదనీ, ఒకవేళ దాంపత్య జీవితం గడిపితే ప్రాణం మీదకి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తారు. ఇక ఆ హీరో పాట్లు చెప్పనలవి కడు ఇది చూసిన స్వరూప్ తనకు కూడా నడుము మీద దెబ్బ తగలబట్టి దాంపత్య జీవితానికి పనికి రాకుండా అయిపోయాననీ, తనకీ ఆంగిక నపుంసకత్వం ప్రాప్తించిందనీ భావించి బాధ పడిపోయాడు. ఆంగిక నపుంసకత్వం అంటే పురుషాంగంలోనే బలహీనం ఉండి స్తంభించ కుండా ఉండటం. ఈ రకంగా బలహీనత పురుషాంగం కండరాలకి సంబంధించి అవవచ్చు. లేదా పురుషాంగం నరాలకి సంబంధించినది కావచ్చు. అయితే శారీరక అనారోగ్యంవల్ల, హార్మోన్ల లోపంవల్ల, మానసిక కారణాలవల్ల కూడా అంగం స్తంభించక రతి జరపడంతో విఫలం కావచ్చు.
ఎప్పుడైనా సఫలీకృతమైన సంయోగానికి ఎటువంటి భయాలు, అనుమానాలు, ఆందోళనలు లేకుండా ఉండాలి. కామ సామర్థ్యానికి పరీక్ష అంటూ పరస్త్రీలతోను, వేశ్యలతోను పనికిరాదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషుని పుంసత్వాన్ని నిర్ణయించేందుకు గీటురాయి కానేరదు. ఎప్పుడైనా సరే మనిషికి పరీక్ష అంటే భయం, టెన్షన్ తయారవుతాయి. ముఖ్యంగా ఈ టెన్షన్, భయం సంయోగం సఫలీకృతం కావడానికి పనికిరావు. అటువంటప్పుడు పరీక్ష అంటూ సంయోగం జరిపి అసఫలుడై ఎల్లప్పటికీ మానసిక వేదననీ, నపుంసకత్వాన్ని తెచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. అలా కాక సానుభూతితో విషయాన్ని పరిశీలించి అసలు కారణం బయటకు తీసి దానికి సంబంధించిన భయాల్ని, అనుమానాల్ని తొలగించినట్లయితే నపుంసకత్వం దానంతటకదే పోతుంది.
కామవాంఛ – నపుంసకత్వం :-
ఆంగిక నపుంసకత్వం :-
No comments:
Post a Comment