Wednesday, 30 November 2011

క్యా సీన్ హై …


ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అతనన్నాడు –
”మన పరిచయం ఎంత విచిత్రంగా జరిగింది. ఓహ్… ఆ పరిచయం ఇలా డెవలప్ అయి, క్యాండిల్ లైట్ డిన్నర్ వరకూ వస్తుందని అనుకోలేదు.”
అతని చేతిలో వున్న తన చేతిని వెనక్కి తీసుకుంటూ, ”ష్… మనల్ని ఎవరైనా గమనిస్తే బావోదు… నాకిలాంటివి కొత్తే… నాకూ గమ్మత్తుగానే వుంది. కానీ భయంగా కూడా ఉంది" అంది.
ఆమె వయసు ఇరవై అయిదు – ముప్పుయ్ మధ్య వుంటుంది. కాటన్ చీర. మ్యాచింగ్ బ్లౌజ్, చెవులకు చిన్న జూకాలు… మెడలో సన్నటి గొలుసు. చాలా సింపుల్ గా వుంది. ఆ సింప్లీసిటే ఆమెలోని అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అతని చూపు ఆమె నడుము ముడత మీద పడింది. అందంగా వుండే ఆ నడుమ్మడత మీద తన పెదవులతో ముద్రవేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఆమె అందీ అందనట్లు అతనికి అవకాశం ఇచ్చీ దూరంగా జరుగుతుంది.
తీర్చిదిద్దినట్లుండే ఆ కళ్ళూ, ముక్కూ, ఎర్రటి పెదాలు, సున్నితమైన చేతివేళ్ళు,… ఆమెలో ప్రతీభాగమూ అతనికి టెంప్ టింగ్ గానే కనిపిస్తుంది.
”ఏంటీ… ఆలోచిస్తున్నారు… ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడు?” అడిగింది అతనివంక చూస్తూ.
అతను నవ్వి అన్నాడు – ”ముందు శోభనం కానీ, ఆ తర్వాత పెళ్ళి గూర్చి ఆలోచిద్దాం.”
”మీలో చిలిపితనం ఎక్కువవుతోంది. ఏమిటా మాటలు… ఎవరైనా వింటే నవ్విపోతారు” ముద్దుగా కోపగించుకుంది ఆమె.
”రేపు నాతొ వస్తావా?” మాట మార్చి అడిగాడతను.
”ఎక్కడికి?” అని అడిగిందామె.
”ఆ ఒక్కటే అడక్కు”
”టాప్ లేచిపోద్ది” రిటార్దిచ్చింది ఆమె.
 అతను నవ్వి చెప్పాడు – ”సిటీకి కాసింత దూరంలో మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఒకటుంది. అక్కడ మంచీ- చెడూ మాట్లాడుకుందాం”
”అదేంటి…?!” ఆశ్చర్యంగా అందామె.
”అదంతే… నువ్వు వస్తున్నావు.. వస్తున్నావు…. వస్తున్నావు” అని అన్నాడతను.
”హిప్నటైజ్ చేస్తున్నావా?”
నవ్వి అన్నాడు – ”ఏదో ఒకటి…”
ఆమె అయిష్టంగానే ఒప్పుకుంది.
అతను ఆమె చేయి నొక్కి వదిలి అన్నాడు – ”గుడ్ నైట్… రేపు గెస్ట్ హౌస్ లొ కలుద్దాం.”
ఆమె వెళ్ళిపోగానే అతను బయటికి వచ్చి తన కారులో కూర్చుని కారుని నెమ్మదిగా క్లబ్ వైపు పోనిచ్చాడు. ఆమెతో తన పరిచయం గుర్తుకొచ్చిందతనికి. కారు క్లబ్ ముదాగింది. ఒంటరిగా కూచుని సెకెండ్ రౌండ్ లొ వుండగా మళ్ళీ ఆమె పరిచయం గుర్తుకొచ్చి ఒళ్ళంతా రక్తం పాకి, వేడి ఆవిర్లను విరజిమ్మిన ఫీలింగ్.
* * * ”
ఎక్స్ క్యూజ్ మీ” ఉలిక్కిపడి బెదురు చూపులతో అతనివైపు చూసిందామె. మంచి ఒడ్డూ – పొడుగు… కార్లోంచి తల బయటకు పెట్టి తననే పిలుస్తున్నట్లున్నాడు.
”ఏ… ఏమిటి?…”తడబడుతూ అడిగిందామె… హ్యాండ్ బ్యాగ్ ను గుండెలకు ఆన్చుకొని.
”బస్సుకోసం వెయిట్ చేస్తున్నారులా వుంది. ఏదో చిన్నగోడవ … ఈ రూటులో బస్సులు నడవవు…” చెప్పాడు కామ్ గా అతను.
”ఇప్పుడెలా?’ తనలో తను గోణకున్నట్టుగా అనుకుందా అమ్మాయి.
”ఈఫ్ యు డోంట్ మైండ్ … మీకభ్యంతరం లేకపోతె నేను డ్రాప్ చేస్తాను”
”మీరా?” భయంగా అడిగిందా అమ్మాయి.
”ఏంటీ… నేనేమైనా హిందీ సినిమా విలన్ అమ్రీష్ పురిలా కనిపిస్తున్నానా?”
”అదికాదు….”
”నన్ను నమ్మొచ్చు…” అన్నాడతను.
ఆమె భయంగా కారు దగ్గరికి వచ్చింది. బ్యాక్ డోర్ తెరిచాడతను. అతనికి తన పక్కనే కూచోబెట్టుకోవాలని వుంది. కానీ ఫస్ట్ డే, ఫస్ట్ టైమ్… సాహసం పనికిరాదనుకున్నాడు. ”మీ పేరు?” కారు డ్రైవ్ చేస్తూ అడిగాడు.
”షర్మిల…”మెల్లిగా చెప్పింది.
”జాబ్ చేస్తున్నారా?”
”అవును….”
”ఎక్కడ…?”
ఆమె సమాధానం చెప్పలేదు.
”పోనీ.., ఎక్కడదించాలో చెబుతారా మిమ్మల్ని….”
”ఆ టర్నింగ్ దగ్గరా?”
”ఊహూ… ఇంకాస్త దూరంలో వుంటుంది. కారులో నేను దిగడం మావాళ్ళు చూస్తే బావుండదు…”
అతను నవ్వుకున్నాడు. ”సగటు మధ్యతరగతి ఆడపిల్ల” అనుకున్నాడు.
*****
అలా వాళ్ళిద్దరి పరిచయం మెదలైంది. రోజూ సాయంత్రం అతను రావడం…. ఆమెను కారులో టర్నింగ్ దగ్గర డ్రాప్ చేయడం… ఆమె బిడియం…. అతని సహనమూ షరా మామూలే. ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, ఆమె చేస్తోన్న ఉద్యోగం లాంటి ప్రశ్నలు అతను రెట్టించి అడగలేదు. ఆమె చెప్పాలేదు. అతని గురించి ఆమె అడగనూ లేదు. అతను చెప్పనూలేదు. ఆమె మధ్యతరగతి అమ్మాయి అని, పెళ్ళికాని అమ్మాయని, సిగ్గూ, బిడియం ఎక్కువని ఆమె ప్రవర్తన చెబుతోంది.
అతనికి డబ్బు వుందని దానికి తోడు వయసూ వుందని తెలుస్తూనే వుంది. ఇద్దరి మనస్సులో ఏముందో ఆ ఇద్దరికే తెలుసు.
* * *
”మన పరిచయం వయస్సు ముప్పయి రోజులు. అంటే నెల…ఈ సందర్భంగా పార్టీ చేసుకుందామా?” అతడు అడిగాడు.
”అమ్మో…. పార్టీనా? అంటే హోటల్ కా, నేన్రాను. మా ఇంట్లో ఆలస్యమైతే కారణం అడుగుతారు”
”పోనీ… రేపు ఆఫీసుకు సెలవు పెట్టు.”
”హమ్మో…. మా ఆఫీసర్ స్ట్రిక్ట్… ఆ రోజుకి జీతం కట్ చేస్తారు. ఒక్కరోజు జీతం తగ్గిందేమిటని నాన్న అడిగితె ఎం చెప్పాలి?”
”ఆ ఒక్కరోజు జీతం నేను సమర్పించుకుంటా…”
”మీరా… మీ దగ్గర తీసుకోవడమా?”
”నేనింకా పరాయి వాడినా?” అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని (కాదు లాక్కొని), ముద్దు పెట్టుకుని, వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు వదేలేసి ”సారీ” అన్నాడు.
ఆమె బిడియమూ, సిగ్గూ, భయమూ అన్నీ కలిసి అభినయించింది.
* * *
ఓ రోజు అన్నాడు – ”నేను డ్రైవర్ ని కాదు. మీరు వెనక కూచుంటే అదే అర్థమొస్తుంది” అని. ఆమెకు అర్థమైంది. అతని పక్కనే కూచుంది. మరుసటి రోజుని బోసిమెడ చూడలేను అంటూ ఓ గోల్డ్ చైన్ కొనిపెట్టి, ఆ మెడ మీద ఓ ముద్దు పెట్టి వెంటనే రియలైజ్ అయి (అయినట్టు నటించి) ”సారీ” అన్నాడు. ఇంకోరోజు నీ చేతులకు మట్టిగాజులా అంటూ బంగారు గాజులు తొడిగాడు. ప్లస్ ఓ ముద్దుతో. మరో రోజు చీర కొనే నెపంతో ఆమెను హత్తుకున్నాడు. ఆమెకిప్పుడు డబ్బులోటు లేదు. అతనికి ఆమె స్పర్శలోటూ లేదు… ఎటొచ్చీ….
* * *
ఆలోచలల నుంచి తేరుకున్నాడు. చిన్నచిన్న టచింగులు, హత్తుకోవడాలు, ముద్దులూ మురిపాలూ అయ్యాయి. ఆ ఒక్కటి తప్ప… అందుకే తను గెస్ట్ హౌస్ ప్రపోజల్ పెట్టాడు. అతని గొంతులోకి బ్రాందీ వెచ్చగా వెళ్ళడం లేదు. కోరిక ఒంట్లో ఆవిర్లుగా కమ్మి బయటకు వస్తున్నాయి.
* * *
”నాకు భయంగా వుంది…” అంది ఆమె.
”నేనున్నాక కూడా భయమా?” ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతను.
ఆమె తలలోని సన్నజాజిపువ్వుల పరిమళం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతని చేయి ఆమె నడుము మడతను స్పృశించి ఆ ఆనందాన్ని అనుభవిస్తోంది. అలాగే ఆ చేయి ఆమె నడుముని చుట్టేసింది. ”పెళ్ళికి ముందు ఇలాంటివి నాకిష్టముండదు… నాకు భయంగా వుంది.”
”నాకూ ఇష్టముండదు డియర్. కానీ వయసుకు కోరికలకు మన ఇష్టాలతో పనేం వుంది. అవి ఆనకట్ట తెంచుకునే ప్రవాహంలాంటివి” అంటూ ఆమెను దగ్గరికి లాక్కుని ఆమె చీరకుచ్చెళ్ళను తప్పించాడు.
”వద్దు… ప్లీజ్…” బ్రతిమలాడుతోంది.
ఆమె ప్రతిఘటన అతనిలోని కోరికను ఉధృతం చేస్తోంది. ఆమె పెదవులను తన పెదవులతో మూశాడు. అతని చేతులు ఆమె హృదయభాగాన్ని శృతి చేస్తున్నాయి. అతని శరీరం ఆమె శరీరాన్ని కరుచుకుని ఆమెలో ఐక్యమావ్వడానికి ఉవ్విళ్ళూరుతోంది. ”ప్లీజ్… నాకు భయంగా వుంది…”ఆమె సున్నితంగా తిరస్కరిస్తూనే వుంది.
అతను మరింత రెచ్చిపోతూనే వున్నాడు. క్షణాలు కరిగేలోగా ఆమెను అంటిపెట్టుకునివున్న వస్త్రాలు.. వివస్త్రాలయ్యాయి. ఆమె అందాలు అసురసంధ్య వెలుగులను విరజిమ్మాయి. నిమిషాలు కరిగేలోగా ఆమె అర్థింపులు… వేడి నిట్టూర్పులయ్యాయి. కాలం చ్బోద్యం చూసేలోగా… సృష్టికార్యం వేగవంతమై ఫలవంతమైనది. ఆమె శరీరాన్ని శృతి చేశాడు. ఆమె అతని ముందు ”శరణాగరి” అయింది.
రెండు శరీరాల పెనవేతలో అక్కడి దృశ్యం రోమాంచితమై దేవతా వస్త్రాలతో ఓ పాలరాతి శిల్పంలా ఆమె పట్టేమంచంపై పవళించింది. ఆమె లేచి తన దుస్తులను కట్టుకుంది. అతను లేచి, బట్టలు మార్చుకుని సిగరెట్ పొగను రింగులుగా వదులుతూ – ”నీకు అన్యాయం చేయను… రేపే మా ఊరెళ్ళి మా నాన్నతో మాట్లాడి… నిన్ను పెళ్ళిచేసుకుంటాను…”
”ప్రామిస్” అంది నీళ్ళు నిండిన కళ్ళతో అతనికి దగ్గరగా జరిగి.
”ప్రామిస్” అన్నాడు ఆమెను హత్తుకుంటూ. అంతే మళ్ళీ వాళ్ళ శరీరాల మీద దుస్తులు మిస్సయి, కోరికలు మిస్సాల్స్ అయి, మరోసారి ఆ గదిని వేడి నిట్టూర్పులతో ముంచెత్తాయి. ఇప్పుడామె రెచ్చి, అతనికి సహకరించి… స్వర్గాన్ని చూపించి శృంగారపు సరిగమలను పలికించింది.
”ఇదిగో ఈ పదివేలు వుండనీ డియర్… నీ పెళ్ళికి ముందే మంచి రింగ్ కొనుక్కో…” అన్నాడు.
పదేవేల నోట్లకట్టని ఆమెకిస్తూ. ”నీ ప్రేమే పదివేలు” అంది డబ్బు అందుకుంటూ.
* * *
ఇది జరిగిన వారం రోజుల తర్వాత… ఒపెల్లా రెస్టారెంట్ లొ …. ఓ కార్నర్ సీటులో అతనూ, అతని ఫ్రెండ్ రామ్ ప్రసాద్… ”ఏంటి బాసూ.. మంచి పార్టీ ఇస్తున్నావు…. ఏంటీ కథ…?” అడిగాడు రామ్ ప్రసాద్.
”ఓ రొమాంటిక్ థ్రిల్… ఓ రొమాంటిక్ అడ్వంచర్…” చెప్పాడు అతను తన ముందున్న గ్లాసులోని ద్రవాన్ని నోట్లో ఒంపుకుంటూ.
”ఏంటో… ఆ రొమాంటిక్ అడ్వంచర్…?”
”నీకు తెలుసుగా … నాకు డబ్బుపెట్టి కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళడం… ఏ ఎక్స్ ప్రెషన్ లేకుండా మనం ఎటు తిప్పితే అటుతిరిగి… ఆ తరువాత డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం… అంతా యాంత్రికం… అలా కాకుండా అందమైన అమ్మాయి – అందులోనూ పెళ్ళికాని అమ్మాయి…. కొంతసిగ్గు, కొంత బిడియం… మరికొంత భయం… వద్దు… వద్దు అంటూ దూరంగా జరిగి ఊరిస్తుంటే… ఆ అనుభవాన్ని స్వంతం చేసుకోవడంలో వుండే థ్రిల్… వాహ్… బ్యూటిఫుల్… అందుకే కొత్త అవతారం ఎత్తా…
సిటీలోని ఓ సెంటర్ ని ఎన్నుకుని వరుసగా నాలుగురోజులు అబ్జర్వ్ చేశా… ఓ అమ్మాయి కనిపించింది. అంతే అయిదో రోజు ‘లైన్’లోకి లాగాను. చాలా జాగ్రత్తపడ్డాను బాసూ… ఆమె బ్యాగ్రౌండ్ అడిగి, ఆమె ఇంటికి వెళ్తే రపు ఫ్యూచర్ లొ డేంజర్. అందుకే ఆమె పర్సనల్ విషయాలు ఏమీ పట్టించుకోనట్టే వుండిపోయా… లక్ ఏమిటంటే ఆమెకూడా నా బ్యాగ్రౌండ్ అడగలేదు. ఓ పాతికవేలు వదిలితే వదిలాయికానీ మంచి సుఖం… ఫ్యామిలీ టైప్ సుఖం… పూర్ గాల్.. నమ్మింది.
పెళ్ళి చేసుకుంటానని ఎదురుచూస్తోంది. రేపట్నించి ఆ సెంటర్ కు వెళితే ఒట్టు. మరో కొత్త సెంటర్ కు వెళ్తా… మరో కొత్త పరిచయం… మరో కొత్త అనుభవం…మరో కొత్త థ్రిల్.” నాలుగో రౌండ్ దాటినా అతను తన అడ్వంచర్ చెప్పుకుపోతూనే ఉన్నాడు.
అదే సమయంలో …. అదే బార్ లొ …. మరో కార్నర్ లొ … జీన్స్ లొ … చేతిలో శాంపైన్ తొ… ఆ అమ్మాయి… తన స్నేహితురాలైన ప్రభతో… రెండో రౌండ్ లొ వుండగా… చేబుతోందామే. ”ప్రభా… భలే ఎక్స్ పీరియన్స్… కాల్ గాళ్స్ గా మన సంపాదన నెలకు మొత్తం ఖర్చులు పోనూ మహా అయితే మిగిలేది పదివేలు… అంతే… అందుకే సంపాదనకు దగ్గర దారి… రాజమార్గం ఒకటి కనిపెట్టా….సిటీలో ఓ సెంటర్ ని ఎంచుకున్నా… సాయంత్రం అక్కడ చక్కని చీరకట్టు… ఫ్యామిలీటైప్ గెటప్… అమాయకమైన లుక్స్ తొ నిలబడ్డా…
కాల్ గాళ్ కన్నుగొట్టి పిలిస్తే ”అదో కేసు” అంటూ తీసిపారేసే మగమహాపురుషులు, ఫ్యామిలీ టైప్ తొ, అమాయకంగా కనిపిస్తే గాలం వేసి, శీలానికి టెండర్ వేస్తారు. అలాగే జరిగింది. ఓ పురుషుడు తన డాబు, కారు చూపించి ‘ట్రాప్’ చేయబోయాడు. పోన్లే అని అవకాశమిచ్చా… దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అడ్వాన్సయ్యాడు. చీరలు, నగలు, నగదూ… ఓ ఫైన్ నైట్ ముహూర్తం పెట్టినన్ను ముగ్గులోకి లాగాడు. అవసరం అయిపోగానే సారీ అంటూ… నిన్ను పెళ్ళి చేసుకుంటానంటూ చివరగా ఓ పదివేలు పెట్టాడు. పూర్ మగాడు… ఇంకా అతనికోసం ఎదురుచూస్తూ కూచుంటాననుకున్నాడు.
జెండా ఎత్తేశా…. ముప్పైవేలు మిగిలాయి. కాకపొతే ఓ నెలరోజులు ఖర్చు చేశా అతని కోసం… ఏమైతే నేం… ఓ కాల్ గాల్ గా నా సంపాదన కొత్త అవతారంతో ముప్పయివేలు. రేపట్నుంచి కొత్త సెంటరుకు మకాం మారుస్తా” అంది అయిదో రౌండ్ లొ ఆమె… అక్కడతనూ… అక్కడే ఆమె…. క్యా సీన్ హై……

No comments:

Post a Comment